Sunday, 15 March 2015

90. మట్టి కుదుళ్ళు - స్పందనలు

బండ్ల మాధవరావు గారుప్రముఖకవి
శ్రీనివాస్ గారూ

మీ మట్టికుదుళ్లను ఆసాంతం పట్టి చూశానుకవిత్వం పాలు తక్కువగా ఉన్నప్పటికి అనుభూతుల పాలు చాలా ఎక్కువగా ఉందిముఖ్యంగా పల్లెటూరి విశేషాలను చాలావరకు ప్రస్తావించారుమరీ ముఖ్యంగా నిన్ను చూస్తుంటేపండుగవికాసపు మూటలు లాంటి కవితలు బాల్యపు స్మృతులలో ఓలలాడించాయినేను మా ఊరి గురించి ఒక దీర్ఘ కవిత రాశానుమీరు ప్రస్తావించిన కొన్ని అంశాలు అనుకోకుండా నా కవితలో కూడా ఉన్నాయిఅది ప్రింటింగ్ కు వెళ్లిందిఫైనల్ కాపి వచ్చిన తరువాత మీకు పంపుతానుమొత్తం మీద మంచి అనుభూతుల్ని మిగిల్చిన కవిత్వాన్ని చదివించారుకలిసినప్పుడు కవిత్వానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకొందాముధన్యవాదాలు
-------------------------------------------------------------------

బీరం సుందరరావుఇంకొల్లు 9848039080,

గౌరవనీయులు డాక్టర్ శ్రీను గారికి - నమస్సులు. 4.3.15  వీరన్న పాలెం స్కూల్ వార్షికోత్సవానికి నేను అతిధిగా వెళ్లాను సందర్భంగా మీరు రాసిన 'మట్టి కుదుళ్ళుకవిత్వం ఇచ్చారుఆమూలాగ్రం చదివానుగ్రామీణ జీవన మూలాన్నిఆత్మీయమైన అనుబంధాన్నిస్వేదజలంతో తడిసిన శ్రమ సౌందర్యపు ఆనవాళ్ళని అద్భుతంగా కవిత్వీకరించారు మీ సువర్ణ లేఖినికి నా శుభాకాంక్షలు


మట్టి చరిత్రే మనిషి చరిత్ర - మట్టి పుట్టినప్పుడే మనిషి పుట్టాడునాగలిని కనిపెట్టినల్లరేగళ్ళు దున్నిబంగారం పండించిప్రపంచానికి అన్నం పెట్టె రైతుకు మించిన త్యాగ జీవిపరోపకారి మరొకరున్నరా అలాంటి రైతు కుటుంబం నుండి వచ్చిన మీరు ప్రతి కవిత లోను పచ్చని పొలాల సౌందర్యాన్నిపంట చేయల సొగసులనుకోడె గిత్తల సోయగాన్నిసరళంగాచక్కగాచెప్పిన మీరు తాత - నాయనమ్మ లకు మీ గ్రామ ప్రజలకు మట్టి కుదుళ్ళు ను అంకితం ఇవ్వటం మీ నిలువెత్తు సంస్కారానికి నిదర్శనం.మీ కవిత్వం కుదుళ్ళు ఎంత బలంగా ఉన్నాయోజయహో రైతన్నమొలకసంపదల మేనుమహోపాధ్యాయుడుతప్పెటకొలుపులుఊరి ఆనవాళ్ళుమట్టి కుదుళ్ళుకవితల్లో కళ్ళకు కట్టి నట్లు చెప్పారుశుభాకాంక్షలతో ----- బీరం సుందరరావు
-----------------------------------------------------------
గంగరాజుమురళీ్క్రిష్ణ,(చదరంగ శిక్షకులు).
నమస్తే డాక్టర్ గారూ!
     నాకు తెలుగు పట్ల అభిమానం అపారం , తెలుగు  సాహిత్యం పట్ల అవగాహన శూన్యం.అటువంటి నాకు కూడా "మట్టికుదుళ్ళు   అనుబంధపు  ఆనవాళ్ళు "  రచన చదువుతున్నంత సేపుఆద్యంతం చక్కనిపచ్చని పల్లెటూర్లో ఆనంద విహారం చేసిన అనుభూతిని కలిగించినది.      రచనలోని అన్ని కవితలూ మనసుని కదిలించేవేపల్లె వాసనల విందు భోజనం రుచి చూపేవేముఖ్యంగ 'అచ్చెరువుకవితలో చెరువుని వివిధ కాలాలలోవివిధ సందర్భాలలోవివిధ స్థితులలో వివిధ అనుభూతులతొ వర్ణించిన తీరు మీ సునిసిత పరిశీలనా దక్షతకు అద్దం పడుతోందిఅలాగే 'గుండెల్లో బ్రతికే ఉందిలో దాపటి ఎద్దును కటిక వాని పాలు కాకుండా తాత గారు కాపాడిన తీరు కధ లాంటి  కవితా సంపుటి కే  తాత గారిని  కధానాయకునిగా మార్చింది.
      కవితామాలికను ఆస్వాదించిన ప్రేరణతో నాస్పందనను అచ్చ తెలుగు లో తెలియచేయాలనిరకరకాలుగ ప్రయొగాలు చేయుట వలన నా స్పందన తెలియచేయుటకు జరిగిన ఆలస్యమునకు మన్నింప ప్రార్ధన.

ఇట్లు గంగరాజు మురళీ్క్రిష్ణ,(చదరంగ శిక్షకులు).
-----------------------

 dr swathi associate professor


సార్, మళ్ళి ఒక్కసారి నాకు నేను గుర్తొచ్చాను., మీ మట్టి కుదుళ్ళు నా కుదుళ్ళను తెరలు తెరలుగా కదిపి పాత బంగారు లోకానికి తీసికోల్లాయి ఏమై పోయాయీ రోజులు అంతా కృత్రిమమం. లిప్ స్టిక్ పూసిన పెదాల లాగ అంతా కృత్రిమమం .. సెల్ కి తెలుగు రాదు. ఎమోషన్స్ కి ఇంగ్లీష్ రాదు. మరిన్ని మంచి సిరా చుక్కలు మీ కలం నుంచి రావాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నా! i burst in to tears . some how this refflected my inner struggle. thanks for sharing this book  dr swathi associate professor& Head  , physiology

No comments:

Post a Comment