Monday 14 November 2016

175.స్మారక పురస్కారాలు -2016

స్మారక పురస్కారాలు -2016  రూ 3,116 = 00 శాలువా, మెమెంటో, సర్టిఫికెట్, సన్మాన పత్రం1) మక్కెన రామ సుబ్బయ్య స్మారకకథా పురస్కారం 2016 - (కార్గిల్ కధలు) శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్, విజయవాడ
2) ఆచార్య నెల్లుట్ల స్మారక కవిత పురస్కారం -2016 - ఈ గాయాలకు ఏ పేరు పెడదాం? - డా బీరం సుందర రావు - ఇంకొల్లు పట్టాభి కళా పీఠం వారి 6 వ వార్షికోత్సవ సభలో ది 12-11-2016 న హనుమంత రాయ గ్రంధాలయం, గాంధీ నగర్, విజయవాడలో బహుకరించుట జరిగింది

Wednesday 9 November 2016

174.వెన్ను విరిగిన కంకులు పై స్పందనలు



 మాన్య మహోదయా! నమస్తే. ఎంతో సౌజన్యంతో మీరు పంపిన మీ రైతు కవిత్వం అందింది ధన్య వాదాలు. జాతి వెన్నెముక కన్నీటి సంద్రమై పోతున్న సంక్షోభాన్ని మీ గీతాలు ఆర్ద్రంగా ఆవిష్కరించాయి. మీ పద సంపద పాటలలో ఒదిగి మెరుపు లీనింది అభినందనలు - విహారి, హైదరాబాద్ 1-9-2016 9848025600
పట్టెడన్నం తినే ప్రతి మనిషి పది సెకన్లు, పండించే రాజు కానీ (నేటి కాలంలో) రారాజు. రైతును గురించి ఆలోచిస్తే అతని గుండె కోత తెలుస్తుంది. మీ అక్షర ఆవేదనకు నమస్కా రిస్తూ .. మీ kavi హృదయాన్ని అభినందిస్తూ .. మీ కవిత్వ పయనం కమనీయంగా సాగాలని కోరుకొంటూ .. డా ధన లక్మి , VAS , SSVH  Vijayawada  94440225770

173.వెన్ను విరిగిన కంకులు పై కవి పుల్లచారి కరీం నగర్ గారి అభిప్రాయం


172.వెన్ను విరిగిన కంకులు పై కలవ కొలను సూర్యనారాయణ గారి స్పందన



171.వెన్ను విరిగిన కంకులు పై మారా శాస్త్రి గారి స్పందన



170. వెన్ను విరిగిన కంకులు "- పై ప్రముఖ కవి ఎస్ ఆర్ పృథ్వి గారి స్పందన


169.రైతుల వెతల బతుకు చిత్రాలు - వెన్ను విరిగిన కంకులు "- పై ప్రముఖ కవయిత్రి మందరపు హైమావతి గారి గారి స్పందన - ప్రజా శక్తీ స్నేహ లో ప్రచురణ - 10/02/2016


168.వెన్ను విరిగిన కంకులు "- పై బెలగాం భీమేశ్వర రావు గారి స్పందన


167.రైతన్న జీవితానికి దర్పణం వెన్ను విరిగిన కంకులు "- ప్రముఖ కవి పులిపర్తి కృష్ణ మూర్తి గారి సమీక్ష - 16/09/29 నేటి నిజమ్ దిన పత్రికలో తేదీన ప్రచురణ


166. వెన్ను విరిగిన కంకులు పై ప్రముఖ కవి నర్సన్ గారి సమీక్ష - 24/09/16 ఆంధ్ర భూమి లో తేదీన ప్రచురణ


165.రైతు కవిత్వాన్ని గేయ బద్దంగా హృదయ వేదంతో వ్రాసిన కవిత్వం ఈ "వెన్ను విరిగిన కంకులు"- ప్రముఖ కవి కిలిపర్తి దాలి నాయుడు, విజయనగరం గారి విశ్లేషణ



164.మట్టి పరిమళం గుబాళించిన చిక్కని చక్కని కవితలే వెన్ను విరిగిన కంకులు- గబ్బిట దుర్గాప్రసాద్ విశ్లేషణ

Top of Form
Bottom of Form
మట్టి పరిమళం గుబాళించిన చిక్కని చక్కని కవితలే వెన్ను విరిగిన కంకులు
గబ్బిట దుర్గాప్రసాద్
Rtd. head Master
   Sivalayam Street ,Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh ,India Cell :
     9989066375 ,  8520805566 Land Line : 08676-232797
******
డా మక్కెన శ్రీను గారితో నాకు ముఖ పరిచయం లేదు .కాని వారు నిన్న తమ ‘’వెన్ను విరిగిన కంకులు ‘’నాకు ఆదరంగా పంపారు .రాత్రికే చదవటం పూర్తీ చేశాను .ఇది రైతు కవిత్వం.  కవి  శాస్త్రజ్ఞులు కూడా .కనుక కవిత్వం శాస్త్ర బద్ధంగా కవితాత్మకం గా విషయ వివేచనంగా పండింది .వెన్నులు విరిగినా తరగని కవితా కంకులను పండించింది .డాక్టర్ గారికి హృదయ పూర్వక అభినందనలు తెలియ జేస్తున్నాను .ఇందులో నాకు అందిన సోయగాలను మీకు పరిచయం చేస్తున్నాను
 అభివాదం శ్రమవేదం ,ఆర్తనాదం సమ్మోదం అనే నాలుగుభాగాలుగా ఉన్న ఈ కావ్యం  రైతు ప్రశంస ,అతని శ్రమజీవన విధానం ,ఇంత చేసినా గిట్టుబాటుకాక పడే ఆవేదన పెడుతున్న ఆర్తనాదాను వినిపిస్తూనే చర్యలు సక్రమ౦ గా అందరూ తీసుకొంటే వచ్చే సమ్మోదం కూడా సోపాన పద్ధతిలో కవి వివరించారు .నేత జీవుల మీద శ్రీ రాధేయ  లాంటి కవులు అద్భుత కవిత్వం వెలువరించారు .రైతులమీదాశ్రీ కొండ్రెడ్డి వెంకట రెడ్డి వంటివారు రాశారు .వాటిల్లో ఆవేశం ,ఆక్రోశం పాలు ఎక్కువ .దీనిలో సమతూకం నాకు కనిపించింది .నాలుగు పాదాలలో చిక్కని చక్కని కవిత్వం చెప్పారుకవి ఈ నాలుగు భాగాల కు వివరణ ఇచ్చారు-అభివాదం లో రైతు గొప్పతనం మట్టికీ రైతుకూ ఉన్న బాంధవ్యం  వర్ణించానని శ్రమవేదం లో రైతు శ్రమ ఆరాటం  వృత్తిధర్మాలు చెప్పానని ,ఆర్తనాదం లో ప్రకృతి వైపరీత్యాలు నకిలీ విత్తనాలు ఎరువులు పురుగులమందుల వలన కుదేలైన రైతు దీన గాధ తెలియ జేశానని ,చివరగా సమ్మోదం  లో ప్రభుత్వాలు రైతుకు సాయం చేసి వ్యవసాయానికి తోడ్పడాలని సూచించానని తన ప్రణాళిక తెలియ జేశారు
ముందుగా రైతుకు అభివాదం చేస్తూ ‘’సేద్యమంటే బహు చక్కని స్నేహం –మనిషీ పశువు పాడే ఐక్యతా రాగం –ఆకలిని హరించే హలం పాడే గాత్రం ‘’అనటం బహుశా నేనెప్పుడూ వినలేదు చదవలేదని గుర్తు .చాలాసుకుమార భావనలు తగిన పదాలతో వర్ణించి వన్నె తెచ్చారు ‘’వ్యవసాయం ఒక సుమ సంగీతం ‘’అనటం గొప్ప అభి వ్యక్తీ .దున్నటం నుండి గంపలకు పైరు ఎత్తుకోవటందాకా వివరిస్తూకవి ‘’నాగలి భువికి చేసే లేత గాయం –చినుకులు పూసే పట్టికి లేపనం –మొలకలు రైతుకు హరిత దీపం –పంటలు పసిడి సిరుల ప్రతి రూపం ‘’చాలా సుకుమారంగా హృద్యంగా ఉంది పాదం గుర్తులతో పునీతమైన క్షేత్రానికి చేతి స్పర్శ మట్టి స్తోత్రమై మురిసిన ఆకాశం చినికే చినుకుల ఛత్రమై భూమి లిఖించిన సిరి సేద్యపు పత్రమైంది . ఏరువాకే ఆనంద హేల అయిన రైతు జాతి ఏలిక ,పాలిక ‘’అనటం రైతుకిచ్చిన గౌరవం .నెత్తిమీద తలపాగ కిరీటం .నడకలో మహా రాజసం ఒలక బోస్తాడు రైతు రాజు .అతనికి ‘’వడ్లు గొడ్లు ‘’చూస్తే సంబరం ‘’కవి వర్ణించిన రైతు ప్రకాశం జిల్లా వీరన్నపాలెం రైతు అయిన ఆయన తండ్రిగారే అని గ్రహిస్తాం ఆయనే ఆశీర్వదించి రాయమన్న కావ్యం ఇదంతా .
  కవినీ రైతునీ ,కాగితాన్నీ నేలను పోలుస్తూ రెండవభాగం శ్రమవేదం ‘’లో ‘’హలాన్ని కలంలా చేత బట్టి –వేదాన్ని సిరాగా జాలువార్చి –చదునైన నేలను కాగితంగా మార్చి – అక్షర సేద్యం చేసే కవి రైతన్నేగా ‘’అంటూ చాలా భావ గర్భిత౦ గా రాశారు కవి .రైతుచేసేది ధర్మ ,కర్మ ,శ్రమ సేద్య యుద్ధాలు హలం తో ,స్వేదం తో ,పొలం తో క్షేత్రం తో వరుసగా ఈ యుద్ధాలు సాగిస్తాడు రైతు అంటే –‘’స్వేదం చిందించిన సేద్య ‘’రూపకం ‘’,వేదం పలికించిన శ్రమ వాచకం ,’’అంతే కాదు శాస్త్ర వేత్త పరిశోధించని జీవన శాస్త్రం . రైతు అనగా ‘’రచయిత లిఖించని పచ్చని కావ్యం అని ప్రక్రియా పరంగానో  ఉత్క్రుస్టుడురైతు అన్నారు ‘’కొడవలి మెడపై పైరు నాట్యాలు ‘’చేస్తాయట .రమ్యమైన మాట .ఏ కార్తికి వాన పడితే పంట ఎలా ఉంటుందో రైతు అనుభవం ,శాస్త్రానుభావాలతో చెప్పారు .’’రేవతిలో సస్య రమ పులకిస్తే ,మృగశిర ముక్కారు పంట ఇస్తుంది కత్తెర వాన కనకం పండిస్తే భరణి వాన ధరణి విరగ బూయిస్తుంది ఆరుద్రలో దరిద్రం ఉండదు పునర్వసులో వాన పుష్ప వర్షమే ,’’అందుకే ‘’కృషీ వలుని కృషికి కార్తెలే హర్షం ‘’ ఉత్తర లో ఊడవటం కంటే ఏడవటం మంచిది ,మూల కురిస్తే ముంగారు పంట ,కృత్తికలో విత్తితే కుత్తుక నిండదు . ఆశ్లేష వర్షానికి అరికాలు తడవదు ,విశాఖ వర్షం విషం ,పుబ్బలో చల్లితే దిబ్బలో పోసినట్లే ఇన్ని జాగ్రత్తలు తీసుకొని వ్యవసాయం చేయాలని హితవు .ఇది రైతు పంచాంగం గా భావించాలి . రైతు అంటే ‘’మానెడు చల్లి పుట్టెడు సృష్టి కర్త ‘’’’హాలికుడు నిలువెత్తు స్వేద దీపం ‘’రైతు రోజూ చూసేది ‘’నవజాత మేఘాలనే –నమ్మేదేప్పుడూ వాతావరణాన్నే ‘’అహం చేరని సనాతన సస్యాలయ౦ ,’’రైతే ఒక వ్యవసాయ విశ్వ విద్యాలయం ‘’ఒకప్పుడు రైతు ‘’సాయం చేసే సేద్య రూపం .మరి ఇప్పుడు ‘’సాయం లేని వ్యవసాయం  ఒకప్పుడు సంబురాల వ్యవసాయం .ఇప్పుడుసాయం లేని  ఎగ తాళికి గురైన ‘’ఎగసాయం ‘’అయింది .
మూడవ భాగం ‘’రైతు ఆర్తనాదం ‘’వినిపించారుకవి .ఇప్పటి వ్యవసాయం ‘’భరోసా  ,భద్రతా లేనిది గజి బిజీ యై విరగ కాచి వరదపాలై ,ఈన గాచినక్కల పాలై నా ‘’సేద్యపు యుద్ధానికి రైతెప్పుడూ సిద్ధమే ‘’పుట్ల కొద్దీ పండించిన అన్నదాత నేడు పట్టెడన్నం కోసం ,ఎదురు చూస్తున్నాడు .రైతు నడుం విరిగింది .ఋతుపవనాలు కను చూపులో కానరాక మేత లేక బక్క చిక్కిన పశువులు ,ఎరువు చిమ్మిన బీడు భూములై వాపోతున్నాడు ‘’చేదకు అందని ఎండిన  బావి  --చేను పండుట ఇక ఎండ మావి ‘’అని నిర్ణయించుకొని ,అన్నీ కుదువపెట్టి విత్తి నా ఫలితం లేక నకిలీ విత్తనాలు ఎరువులకు బలై చితికి చేరువయ్యే కట్టె అయ్యాడు అందుకే చివరికి
‘’పగ్గం కాడి మేడి వదలబడి –కొడవలి నాగలి మూలన పడి –రైతన్న అడుగు మెల్లగా తడబడి –చరిత్రలో కలిసిపోఎను సాగుబడి ‘’అని రైతు దీన హీన చరిత్రను కళ్ళముందు ఉంచారు .ప్రపంచీకరణం తెచ్చిన గొప్ప మార్పు రైతు కూలీఅవటం కమత ౦ సెజ్ లు గా మారటం .తాను పండించిన పంటకు ధర నిర్ణయించే అధికారం లేక ,వ్యవసాయం జూదంగా మారింది ‘’ దేశాన్ని కాచే సూరీడికి పొద్దు పొడవటం లేదు ‘’ఆర్దికమే అన్నీ నిర్ణయిస్తుంటే హార్దిక బంధాలు పటా పంచలవుతుంటే నిబద్ధతకే తిలోదకాలిచ్చే రోజు –‘’మానవీయత మరువని రైతే రాజు ‘’అంటారు కవి .
   ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో కవి శాస్త్ర వేత్తగా ఆలోచించి చెప్పారు ‘’సమ్మోదం ‘’అనే 4 వ భాగం లో ‘’సాగు దిగుబడి నిష్పత్తిలో సామ్యం –దిగుమతి ఎగుమతుల్లో భాగ స్వామ్యం –ధరల నిర్ణయాన రైతులే ముఖ్య పాత్రలు –నెరవేరాలి స్వామినాధన్ సస్య సిఫార్సులు అని సూక్తి ముక్తావళి చెప్పారు.చివరగా రెండు బంగారు కవితలతో రైతు కావ్యానికి పుస్తకానికి ముగింపు చాలా అర్ధవంతంగా పలికారు కవి .‘’నాలుగు వేదాలు విశ్వ జనితం –నాగేటి నాదాలు రైతు జీవితం –శ్రమ వేదమే జాతి నినాదం –స్వేద వాదమే జనతకు నాదం ‘’అని రైతు గీత ‘’సేద్యపు భగవద్గీత చెప్పారు .చివరగా ‘’రైతు తలగుడ్డవ్వాలి జాతి పతాకం –ఎర్ర కోట పై ఎగరాలి సేద్య కపోతం –రైతు రంగా ఆశయాలే రైతుకు భోజ్యం –గాంధీజీ కన్నకలలే గ్రామ స్వరాజ్యం ‘’అంటూ ఎంతో ఆశాభావంగా ‘’వెన్ను విరిగిన కంకుల్ని మళ్ళీ ‘’వెన్ను విరుచుకొనే లాగా చేయాలని ఆరాట పడ్డారు కవి శ్రీ మక్కేన శ్రీను .
ముందుమాటలలో కవి తండ్రి కావ్యాన్ని అంకితం పొందిన  శ్రీ మక్కేన రామ సుబ్బయ్య గారు ‘’హలమే మా శ్రీను కలం ‘’అని వెన్ను తట్టి ప్రోత్సహించారు ఇంట్లో కవ్వం చేలో కర్రు కదిలితే కరువే ఉండదని అందుకే రైతు రాజు  రారాజు అయ్యాడని ,ఇప్పుడు అంతా ఉల్టా అయిందని బాధ పడ్డారు .హైదరాబాద్ ‘’ఇగ్నో ‘’లో అసోసియేట్ ప్రొఫెసర్ డా పి వి కె .శశిధర్ ‘’జీవనకవనం ,మట్టి కుదుళ్ళు ‘’,భావ తరంగం రాసి ప్రశంసలు పొందిన శ్రీ మక్కేన సార్ కవి రాసిన ఈ కవితా సంపుటి అందరి మన్ననలు పొందాలని ఆశించారు ‘’తన పదవీకాలం లో చాలాభాగం వ్యవసాయ రంగం లో నే గడిచిందని శ్రీను గారు ‘’Fully exploited the versatility of the Telugu Language ‘’అని ఆశీర్వదించారుఆంద్ర ప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రెటరి భు భాషా కోవిదులు  డా మోహన్ కందా . 
‘’మక్కేన శ్రీను గారు –చెక్కిన బొమ్మ ఈకావ్యం ‘’అని’’ ఆయన నడిచే నవ్య సేద్యాలయం ‘’అని కీర్తిస్తూ ‘’విత్తనం మొలిస్తే గేయం –కరువు నవ్వితే గాయం –రైతు బతికితే అజేయం –రైతు దుఖం ప్రభుత్వాలకు పరాజయం ‘’అంటూ హెచ్చరిక జారీ చేశారు ఇంకొల్లు ,తెలుగు అధ్యాపకులు కవి ,రచయిత  .డా బీరం సుందర రావు ‘’.నామాట ‘’అంటూ కవి గారు తానుఆచార్య రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం స్నాతక స్నాతకోత్తర డాక్టోరల్ పట్టాలు పొంది ,తిరుపతి పశువైద్య విజ్ఞాన కళాశాలలో చదువుకోన్నానని ,ఉద్యోగ ధర్మం రచనా శక్తికి అడ్డుగా నిలిచిందని ,ఆంగ్లం లో వైజ్ఞానిక వ్యాసాలూ 200కు పైగా రాశానని ఈ మధ్యనే ప్రవ్రుత్తి పై  మ నసుపోయి తెలుగులో మూడు రచనలు చేశాననిదీనినీ ఆదరించమని కోరారు .కనుక అందరు చదివి ప్రోత్సహించాలని కోరుతున్నాను .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -28-8-16- ఉయ్యూరు

 




163.వెన్ను విరిగిన కంకులు పుస్తకం