Tuesday 6 December 2022

శ్రీ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ , విజయవాడ వారు ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా కధ , కవిత మరియు ఇతర సాహితీ ప్రక్రియలలో బహుమతి పొందిన రచయితలకు 24 -11-22 గురువారం సాయంత్రం 4 గంటలకు గుంటూరు బ్రాడీపేట లో పురస్కార ప్రధానోత్సవం నిర్వహించారు.

 



 డా కె వి రావు సాహితి పురస్కారం ను  డా చెన్నకేశవ  రచించిన " కోకిల పాటలు అనే  బాల సాహిత్యం పుస్తకానికి  అందచేశారు .



  ముఖ్య అతిధిగ  శ్రీమతి డా  నందమూరి లక్ష్మి పార్వతి  చైర్  ప ర్సన్ ,   ఆంధ్ర ప్రదేశ్ తెలుగు సంస్కృత  సంస్థ . విశిష్ట అతిధిగా రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ శ్రీ  మందపాటి  శేషగిరిరావు గారు ,  విశిష్ట అతిధిగా ఆంధ్ర బ్యాంకు  పూర్వ డిజిఎం  గంధం రవికుమార్ గారు ; సభాధ్యక్షులుగా శ్రీ రాయవరపు  లక్ష్మి శ్రీనివాస్ , సభ నిర్వాహకులుగా పట్టాభి కళా  పీఠము అధ్యక్షులు డా తూములూరి రాజేంద్ర ప్రసాద్  గారు పాల్గొని విజేతలను అభినందించారు . ఈ పురస్కారం కింద ప్రతి విజేత రూ  7,000/ ల  నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం  శ్రీ  మక్కెన రామసుబ్బయ్య  ఫౌండేషన్ ద్వారా అందుకొన్నారు.ఈ కార్యక్రమంలోడాక్టర్ మక్కెన శ్రీను,  శ్రీ ఆత్మకూరు రామకృష్ణ , శ్రీ పాలేరు పోతురాజు  మరియు పలువురు సాహితీవేత్తలు పాల్గొని వారి సందేశాలను వినిపించారు.