నమస్తే సార్,
మీ మట్టి కుదుళ్ళు చదివాను, బాగుంది ... అంటే ఆ పదం చాల చిన్నగా వుంది. అందుకే ఎంత బాగుందో చెప్పాలని ఈ జాబు. చాల సంవత్సరాల కు ఇలా ఓ వుత్తరం రాయాలనిపించేలా చేసింది. మీ మట్టి కుదుళ్ళు ఇక మీరు మీ పల్లెలోకి మీతో ప్రయాణించేలా చేసారు. నాలాంటి పాటకులను. కవి హృదయం సున్నితం, సాధారణ ప్రజలు చూడలేని ఆనందం అతను చూడగలడు. ఆ ఆనందం అందరు పొందాలనే రచనలు రచిస్తాడు అని మీరూ చదివే వుంటారు. మీ మట్టి కుదుళ్ళ ద్వారా మీరదే చేసారు. థంక్ యు సర్

సృష్టిని తెలుసు కోవడం అంటే అతి దగ్గర మార్గం తనను తను తెలుసుకోవటమే అన్నారు కదా, మీ ఆలోచనల కూడా కనిపిస్తున్నాయి ఇందులో. సరళత, కృత్రిమత్వం, కపటం లేకపోవటం ....
ఆ అర్ధం ప్రతి పేజీ లోను కనిపిస్తుంది.. అదిగో మా వూరు త్జో మెదలు పెట్టి పాటకులను పొలం గట్ల మీద నుండి నడిపిస్తూ తీసికెళ్ళి పోతుంది పుస్తకం .. నిజమే జన క్షామం తీర్చేవాడు ...
జన క్షేమం కోరే వాడు ఒక్క రైతే కదా .. రతనాలు గూర్చి వర్ణనలు చదివాను కాని కొత్త బియ్యంలో రతనాలు చూశానని చెప్పే కవిని మొదటిగా చూస్తున్నాను. మట్టి వాసనలు అంటే నాతో సహా అందరికీ ఇష్టమే, అలాంటి దాన్ని పొత్తిళ్ళ లోని వెచ్చదనం ... అమ్మతనం లో పోల్చటం నాగలి ... సాలును చేయటం ...
సజీవ చిత్రంతో పోల్చటం ... మంచి మొలకల నివ్వమని ...
విత్తనమ నాటుతూ బతిమలాడటం ఇవి పుస్తకం స్థాయిని పెంచేశాయి.
పూర్వం చెరువులు లేని పల్లెలు లేవు కాని మీరు వర్ణించిన చెరువు ఒక్కసారి ఒకా సారి చూద్దామా అని పాటకులను ఊరించారు. వూరి దారిలోని వంపులు ... గీతల్లో మీకు లెక్కలు కనిపించాయంటే ఆ కంపారిజన్ అద్భుతంగా వుంది. సగర్వంగా మీరు పరిచయం చేసిన సంపదల మేను మా ఆరెకరాల చేను బాగుంది. నిజమే ఆవు .. ఎద్దు ... రైతు ... వీళ్ళది విడదీయరాని బంధం ఎక్కడున్నాడో ... మీ అందాల రాముడు

భూమినే నమ్ముకుని శ్రమ తప్ప మరేం తెలియని సృజన కర్త తాత గారు ... పల్లెతో ... పాడితో ... పశువులతో ...
మమేకమై జీవించిన ప్రేమ ప్రపూర్ణ నాయనమ్మ గారు పాళీ జీవనానికి ప్రతీకలు. నెల తల్లి సాక్షిగా రైతు తనని తన జీవితాన్ని అర్పించుకోవటం ...
అతని ఆర్తి .. వూరి వారికే కాదు అందరికి అర్ధం అవుతుంది. మీ దాపటి ఎద్దు శ్రమ ... రైతు కు ప్రతి కష్టం లోను తోడుగా నీడగా వున్నా, విశ్వాస పాత్రమైన మూగ జంతువుకు మంచి సముచిత తోడ్పాటు ముసలి ప్రాయంలో తల్లి తండ్రులను చుసుకున్నట్లుగా దానికో ఓదార్పు బాగుంది. నిజంగానే కన్నీరు రావాలిసి నంత విషయం. మీ వూరు గురించి "నిన్ను చూస్తుంటే" లో మీరు నింపిన అనుభవాలు ... జ్ఞాపకాలు పల్లె నేపధ్యంలో పెరిగిన ప్రతి వాళ్ళు గుర్తు చేసుకోవాల్సినవి, తెలియని వారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి
మా వూరి బ్రహ్మ లో చేతి పని వారి నైపుణ్యం అద్దంలో చూపించారు, ఏ పాలీ టెక్నిక్ చదువులు లేక పోయిన ఎంతో ప్రావీణ్యాన్ని చూపి రైతుకు మొత్తం పల్లె జీవనానికి ఆయువు పట్టుగా నిలచారు కుమ్మరి ...
కమ్మరి లాంటి వారు ధన్య జీవులే మేము కమ్యూనికేషన్ క్లాసు చెప్పాలంటే ఈ సంప్రదాయ పద్దతులు తప్ప డప్పు ... టముకు ... దండోరా ... లాంటివి చెప్పాలంటే పిల్లలకు అర్ధం కాదు, మీ ప్రయత్నం ... మీ తపన ... ఇలాంటి మీడియా ఒకటున్దేదని చెప్పాలన్న తలపు చాల బాగుంది
తెల్ల డేరా తో టెంటు లో సినిమా చుసిన అందరి అనుభవాలు మల్లె ఒకసారి నిద్ర లేపుతున్నారు. కొలుపులు పండగ లో జాతరలు ... పండుగ సంబరాలు ... అసలు పల్లె జీవనం అంటే ఇవన్ని ఒక ప్యాకేజి లా వచ్చేస్తాయి. పల్లెలు మారు తున్నాయి ... పాత వాటిని వెతుక్కోవాల్సి వచ్చింది. మీ రచన తో పాటు ప్రయాణించాక పాటకుడు సంతోష పడి .... బాధ పడతాడు. ఇంటికి సెలవులకని వచ్చి పండుగ ... ఊరు ... సంబరాలు .. అన్ని ముగిసాక మళ్ళి చదువుల కోసమో ....... వుద్యోగం కోసమో ... అందర్నీ ... అన్నింటినీ .... వదిలి వెళ్లి నట్లుగా అవుతుంది పాతక్నికి ... అయినా సంతోషమే ... పరిచయ వాక్యాలలో మీరు పశు వైద్యులనీ ... ఉత్తమ బోధకుడని ... జంతువుల శస్త్ర చికిత్సల లలో ప్రావీణ్యు లని రాసారు. అందులో ఏది ఆశ్చర్యం లేదు మీ మూలాలు మీరు మరచి పోలేదు ... దాన్నే వృత్తిగా స్వీకరించి నందుకు మరింత ప్రేమ .... బాధ్యత కలసి పని చేస్తున్నారని అర్ధం అయ్యింది. మీ మట్టి కుదుళ్ళు మంచి అను భూతిని పల్లెలో మానసిక అనుబంధాన్నిమిగిల్చింది
అనేకనమస్కారాలతో
శ్రీమతిదారలవిజయకుమారి,
శ్రీమతిదారలవిజయకుమారి,
లెక్చరర్ మరియు కవయిత్రి తిరుపతి
.
.
మీ మట్టి కుదుళ్ళు చదివాను
ReplyDeleteబాగుంది ... అంటే ఆ పదం చాల చిన్నగా వుంది.
అందుకే ఎంత బాగుందో చెప్పాలని ఈ జాబు.
చాల సంవత్సరాల కు ఇలా ఓ వుత్తరం రాయాలనిపించేలా చేసింది.
అద్భుతంగా వున్న ఓ పుస్తకాన్ని"బాగుంది "అనే ఒక్కమాట తో ఎలా వూరుకోగలమంటూ...ప్రస్తుత తరంలో మర్చిపోతున్న" జాబు " రాయడం ....
ఇలాటి స్పందనలే ..మట్టికుదుళ్లు పుస్తక గొప్పదనాన్ని తెలియజేస్తున్నాయి
కవి హృదయం సున్నితం, సాధారణ ప్రజలు చూడలేని ఆనందం అతను చూడగలడు. ఆ ఆనందం అందరు పొందాలనే రచనలు రచిస్తాడు అని మీరూ చదివే వుంటారు. మీ మట్టి కుదుళ్ళ ద్వారా మీరదే చేసారు.
విజయ కుమారి గారు పై వాక్యాలలో ఓ కవి హృదయం ఎలాంటిదో అద్భుతంగా విశ్లేషించారు.