Sunday 28 September 2014

63. చెలి భావాలు-అద్వైతం

సృష్టిలో
ఇన్ని అందాలుంటే
నా నయనాలెందుకు
మీ వైపే పయనిస్తున్నాయి?
ప్రకృతిలో
ఇన్ని పరిమళాలు వుంటే
మీ స్పర్శ కే నా తనువెందుకు
పులకరిస్తుంది?
పుడమిపై
ఇన్ని మధురానందాలు ఉంటే
మీ స్వరమే ఎందుకు శ్రావ్యంగా
వినిపిస్తుంది?
జగత్తు లో
ఇన్నిమహత్తులుంటే
మీ సమక్షమే ఎందుకు నన్ను
పరవశింప
చేస్తుంది ?
మీరు
అద్వితీయం ...
అద్వైతం (ఎవరికి అర్ధం కారు).

No comments:

Post a Comment