జీవితం అంటే ఏంటో తెలిసిన తరువాత
మేము కూడా ఈయనలా ఉండాలి అని అనుకూనేలా చేసింది మీరు,
చదువు అంటే పాఠాలు మాత్రమే కాదు
వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం అని తెలియచేసింది మీరు,
ఒక వ్యక్తి మాటలు, చేతలు చాలామందిని ప్రభావితం చేయగలవు
అన్న మాట కి నీలువెత్తు నిదర్శనం మీరు,
మనం చెప్పిన మాట, వినే వంద మందిలో
ఒక్కరికి ఉపయోగపడిన చాలు అని మాకు చెప్పింది మీరు,
మొదటి రోజు తరగతి లో మీరు చెప్పిన మాట
"నేను ముందు కష్టపడతాను, అంతే కష్టాన్ని మీ దగ్గర నుండి ఆశిస్తాను"
ఇప్పటికీ, ఎప్పటికీ మర్చిపోలేను
మా ఎదుగుదలనే మీ గురుదక్షిణ గా భావించే,
మీ లాంటి గురువుల రుణం ఏమిచ్చి తీర్చుకోగలం?
మీరు బాగుండాలి, ఇలాగే మా తరువాత తరాలకి దారి చూపించాలి,
అని కోరుకోవడం తప్ప?
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సార్.
గురువులను ఉత్తేజపరచే విద్యార్ధులకు నేను పునరంకితం
GURUVULUNU UTTEJA PARICHE VIDHYARDULUKU NENU PUNARANKITAM..
ReplyDeletechala bagundi sir..mee students iena maa andari grattitude ni akshara rupam lo pettina "POORVA VIDHYARDIKI" danyavaadhalu..