Friday 19 September 2014

61."జీవన కవనం" కు అభినందనలు



హలం బీడు భూముల్ని దున్నేస్తుంది
కలం చెడిన సమాజాన్ని కడిగేస్తుంది
యంత్రాలున్న హలం హలమే
అంతరజాలమున్న కలం కలమే
హలం కులాన్ని నమ్మిన రైతు రారాజు
కలం బలాన్ని నమ్మిన కవి కవిరాజు
పదునెక్కిన హలం పుట్టించిన కోలా హలాన్ని
మది నెక్కిన కలం సృష్టించిన కల కలాన్ని
సమన్వయంతో సమపాళ్ళలో
ఆవిష్కరించిన సవ్యసాచి
మిత్రమా! మక్కెనా!
నీవో "భూకవి"
నీ శతకాలకు ....
పతకాలు - పతాక శీర్షికలు
అక్కరలేదు
బిరుదులు- బహుమతులు
అవసరంలేదు
సన్మానము - సత్కారాల
సందడి లేదు
ప్రశంసలు- పదోన్నతులు
రావాలని లేదు
మంచి మాట చెప్పటానికి
వేమనే కానక్కర్లేదు
మనసున్నోడయితే చాలని
నిరుపించావ్
అభిమానంతో
డా .. సురేష్ కుమార్

1 comment: