Friday 16 May 2014

21." నీడ"-" ఆత్మ "


ప్రియా !
ఇన్ని రోజులు మీరు
నా " నీడ" ఆనే భ్రమలో వున్నాను !
నేను నవ్వితే నవ్వారు
ఏడిస్తే ఏడ్చారు కాబట్టి.
అది నిజం కాదు .
నేను నవ్వమంటే నవ్వుతారు.
ఏడిపిస్తే ఏడుస్తారు
నేను ఆపదలో వుంటే ధైర్యానిస్తారు
నేను భాధలో వుంటే ఓదార్పు అందిస్తారు
అందుకే మీరు నా " ఆత్మ " .
ఇక మన సాంగత్య మంటారా !
కొన్నింటికి ఆయుష్షు తక్కువవుంటుంది .
అనుభూతి పదిలంగా వుంటుంది
పువ్వు పరిమళం మాదిరి !
సూర్యుడు పగలు మాత్రమే కనిపిస్తాడు .
వెలుగును ఇస్తాడు .
రాత్రిళ్ళు ఆయన ఉనికితెలియదు .
అంత మాత్రాన ఆయన విలువ తగ్గుతుందా ?
మీరు నాకంతే !

1 comment: