మిత్రమా ...
మక్కెన ...
ఆలస్యానికి క్షంతవ్యుణ్ణి ..
కారణం నేను సోమరిని (పుట్టుకతో కాదు)
నీ కవితలన్నీ చదివా ..
కళ్ళతో కాదు ..
మనస్సుతో!
అందుకే .. అందుకో ...
నా భావాల ..
అక్షరమాల ..
కవితలు కావవి
మక్కెన చెక్కిన శిల్పాలు
మక్కెన చేజిక్కిన భావాలు
అక్షరాలకు పాదాలను
పదాలకు ప్రాణాలను
ఆలోచనలకు ఆకారాన్ని
అనుభవాలకు ప్రతిరూపాన్నిచ్చి
కలం కుంచెతో దిద్ది
మనోరంజకంగా రంగులద్ది
తెల్ల కాగితాలపై
కవితాక్షరాలను ..
సంధించిన అస్త్రాలలా
జివ్వున తగిలేలా ..
రివ్వున వదిలావు ...
హాయిగా కొన్ని
భాధతో కొన్ని
ఆవేదనతో కొన్ని
ఆక్రందనతో కొన్ని
అభిమానంతో కొన్ని
అనురాగంతో కొన్ని
లిఖిస్త్థు ... సుఖిస్తూ - ఆస్వాదిస్తూ
నీవు రాసిన కవితలు ..
రచనలు
పాటాల కోసం కాక
పాటకుల కోసమూ కాక
మానసిక స్వాంతన కోసం అందరితో
పంచుకొంటున్నావ్ ..
కలాన్ని ... కాలాన్ని
కత్తిని ... మస్తిష్కాన్ని ..
సమపాళ్ళలో ఆదరించి
శస్త్రాన్ని ... శాస్త్రాన్ని ..
సమన్వయంతో రంగరించి
సాగించే నీ రచనలు ... నా దృష్టిలో ...
సమాజానికి ప్రతిబింబాలు ..
వాస్తవికతకు దర్పణాలు ..
సమస్యలకు ప్రతిరూపాలు ..
సంఘర్షణకు ప్రతిధ్వనులు ..
సాగని నీ రచనా వ్యాసంగాన్ని ..
అభినందనలతో ...
మిత్రుడు సురేష్__
suresh sir kuda ekamythe....... ee blog adhurs
ReplyDeletesuper ga chepparu suresh sir ma makkena sir gurinchi......
ReplyDeletemimmalni mimmu(DR makkena) gane, nijanni daayakunda sunnitam ga, maa makkena garni keertinchina suresh gariki maa manaspurti dhanyavaadalu.
ReplyDelete