Monday, 7 April 2014

10 .శ్రీ రామ నవమి


అందరికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !  ఈ పండుగ విశేషాన్ని తెలిపే  ప్రయత్నమే ఈ అక్షర రూపం ...
  శ్రీ రామ నవమి


    పితృ వాక్య పరిపాలన , రామ రాజ్యం
    
ఇవే శ్రీ రాముని పరిచయ పదాలు
    
ఒకే మాట , ఒకే భార్య , ఒకే బాణం
    
ఇవే శ్రీ రాముని సుగుణాలు
    
జగతి మనుగడకు సూచికలు
    
ప్రజలంతా ఆచరించ వలసిన ధర్మ సూక్ష్మాలు
    
శ్రీ రామ జననం , సీతా రామ కళ్యాణం ,
    
రావణ సంహారానంతర పట్టాభిషేఖం
    
అన్ని చైత్ర శుద్ధ నవమి నాడే జరిగాయట
    
అదియే శ్రీ రామ నవమి అని లోకోక్తి !
   
వసంత ఋతువు
    
చైత్ర శుద్ధ నవమి
    
పునర్వుసు నక్షత్రం
    
కర్కాటక లగ్నం
    
అభిజితు ముహూర్తం
    
త్రేతాయుగం
    
శ్రీ హరియే కౌసల్య పుత్రుడై
   
సప్తమ అవతారంగా
    
శ్రీ రామ జననం
    
రావణ సంహారమే లక్ష్యం
    
సురులను రక్షింప
    
అసురులను శిక్షింప
   
ఉదయించిన దివ్య తేజం
    
మునులకు సుదతి
    
మిగిల్చిన కాంతి పుంజం
    
భూమిజ పతిగా
    
జన హితమే ధర్మంగ
    
పరిపాలించిన
    
జగదభి రాముడు
    
గుణ ధాముడు
    
రవికుల సోముడు
    
రఘు రాముడు
    
శ్రీ రాముడు
    
ఆరాధ్యుడు
    
ఆచరణీయుడు !

 
సీత రాముల కళ్యాణం చూతం రారండి
  ఈ సందర్భంగా తెలుగునాట ప్రతి పెళ్లి మండపంలో , శ్రీ రామనవమి నాడు ప్రతి ఇంట , ప్రతి పల్లెలోమారు మ్రోగే మనకు మాత్రమే దక్కిన వారసత్వ సంపద అయిన ఈ గీతాన్ని గురుతు తెద్దామని  నా అభిలాష. గీత రచయతకు జేజేలు పలుకుతూ..  .


సీత రాముల కళ్యాణం  చూతం రారండి
శ్రీ సీత రాముల కళ్యాణం చూతం రారండి

సిరి కళ్యాణపు బొట్టున బెట్టి
మణి బాసికమును నుదుటను గట్టి .. నుదుటను గట్టి
పారాణిని పాదాలకు బెట్టి 2
పెళ్లి కూతురై  వెలసిన సీత... కళ్యాణం చూతం రారండి
 శ్రీ సీత రాముల కళ్యాణం  చూతం రారండి
 సంపగి నూనెను కురులను  దువ్వి..  కురులను దువ్వి
సొంపుగ కస్తూరి నామం దీర్చి .. నామం దీర్చి
చంపగా వాసి చుక్కను పెట్టి ...2
పెళ్లి కొడుకై వెలసిన రామును... కళ్యాణం చూతం రారండి
శ్రీ సీత రాముల కళ్యాణం  చూతం రారండి
 
జానకి దోసిట కెంపుల త్రోవై...   కెంపుల త్రోవై
రాముని దోసిట నీలపు రాజై ...నీలపు రాజై
ఆణి ముత్యములు తలంబ్రాలుగా..2
శిరముల మెరసిన
సీత రాముల కళ్యాణం  చూతం రారండి
శ్రీ సీత రాముల కళ్యాణం చూతం రారండి
 ******


7 comments:

  1. ఎన్ని వేల వాక్యాల లోనైనా వర్ణించ లేని శ్రీరాముణ్ణి కొన్ని సరళ పదాల లో ఆవిష్కరించారు సార్. మీ కు అభినందనలు సార్.
    అలాగే మీకూ
    శ్రీ రామ నవమి శుభాకాంక్షలు సార్.

    ReplyDelete
  2. sir antarinchi potunna mana sampradayala mariyu telugu bsasha gurinchi, andariki acharaneeyamina sree ramudi gurinchi atyadbhutamuga varnicharu.... idi konasaginchandi..
    Sree rama navami subhakankshalu..

    ReplyDelete
  3. Sir, happy Sri Rama Navami,
    but, mee alochana latho koodina avesham kalisina oka manchi kavitha ni chadavalani vundi sir...........................

    ReplyDelete
  4. సార్ ఇది మీలో వున్న మరో రూపంలాగా వుంది.నిజంగా I sincerely appreciate your efforts

    ReplyDelete