Monday, 10 August 2015
Tuesday, 7 July 2015
109.అంతరాత్మ -కవిత చిగురు కల .. అంతర్జాల పత్రిక ప్రచురణ జూన్ 2015
అంతరాత్మ
ఆచార్య మక్కెన శ్రీను
9885219712
పచ్చని
చెట్టు కింద కూర్చొని
చిగురుటాకులను
చించావు
ముని
వేళ్ళతో కొనలనే తెంపావ్
లేత చిగురలను
చిదిమివేసావు
మల్లె
తీగ దగ్గరకెళ్ళి మొగ్గను
కొన
గోటితో నే గిల్లి తుంచావు
విచ్చకుండానే
మోడయ్యింది
పరిమళాలు
లేకుండా నేల రాలింది
స్వేచ్చగా
ఎగిరే తూనీగను పట్టావు
కర్కశ
పీడనంతో రెక్క విరిచావు
అచలన
జీవిని చూసి చిందులేసావు
విహంగ
ఆహ్లాదాన్ని హరింప వేశావు
చిటారు
కొమ్మన చిలకే మయ్యింది
చిలకను
తెచ్చి పంజరంలో పెట్టావు
పలుకులు
నేర్పి పలుచన చేసింది
కులుకులు
వదిలి కుయుక్తులు చెప్పింది
ప్రకృతి
చెప్పే పాటాలు వద్దంటున్నావు
ఆకృతి
లేని కృత్రిమాలే కావాలంటున్నావు
వికృతి
దాల్చిన మనసును పెంచావు
జాగృతి
మరచి మనుగడ సాగిస్తున్నావు
చేసిన
తప్పులు ఎక్కడి కెళతాయి
నిను
వెంటాడుతూ వెన్నంటి ఉంటాయ్
నీలో
అలజడి రేపుతూనే
ఉంటాయి
ఆత్మ
పరిశీలన అడుగుతూనే ఉంటాయి
నిబ్బరంగా
నిలిపి ఉంచు నీలో సహనం
మనసంత
పూర్తిగా నింపుకో సున్నితత్వం
ఒప్పులు
చేసి నవ్వుతు గొప్పగా బతుకు
అంత రాత్మ
ఎప్పుడు నీకు తోడు ఉంటుంది
*****Thursday, 2 July 2015
Monday, 8 June 2015
Subscribe to:
Posts (Atom)









